AP : శభాష్ మగువా.. Sonu Sood కి పెన్షన్ విరాళమిచ్చిన యువతి!! || Filmibeat Telugu

2021-05-13 1,379

Boddu Naga Lakshmi donates her pension 15000 rupees to sonu Sood Foundation.
#SonuSood
#BodduNagaLakshmi
#SonuSoodFoundation
#Andhrapradesh

సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు, దస్కం, కీర్తి ప్రతిష్ట కాదు సాయం చేయాలనే మంచి మనసు ఉండాలి. ఈ రోజుల్లో అలాంటివాళ్లు దొరకటం చాలా అరుదు. అసలు ఏ మాత్రం పరిచయం లేకపోయినా సరే తనను ఇంతటి వాడిని చేశారు అన్న ఏకైక కారణంతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాక భారతదేశంలో అందరికీ సాయం చేస్తున్నారు. ఏ మూలన ఏ అవసరం వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ఆయన దృష్టికి తీసుకువెళ్లినా సరే ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అలాగే తనలా సేవ చేయాలనే కోరిక ఉన్న అందరూ డబ్బు సాయం చేసేందుకు గాను సోనూసూద్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు.